ఆపరేషన్ క్లీన్ స్వీప్: విజయవాడను ముంపు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాకాలాన్ని పురస్కరించుకుని “ఆపరేషన్ క్లీన్ స్వీప్” రెండో వారానికి శ్రీకారం చుట్టారు. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలో అదనపు కమిషనర్ డా. డి. చంద్రశేఖర్ ఈ డీ-సిల్టింగ్ పనులను ప్రారంభించారు. నాలుగు వారాల పాటు సాగే ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా.. ఈ వారం స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, కాలువలు, బ్యాక్ లేన్లలో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగిస్తున్నారు.
నగరవ్యాప్తంగా ఇప్పటివరకు 116 కిలోమీటర్లకు పైగా డ్రెయిన్లలో పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు కాలువల్లో చెత్త వేయకుండా సహకరించాలని కోరారు.










