చీరాలలో భారత న్యాయవాదుల సంఘం (IAL) 22వ మహాసభలు ఘనంగా నిర్వహించగా, కొత్త పట్టణ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆసాది సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మోపూరి తారక రామారావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి IAL జాతీయ ప్రధాన కార్యదర్శి, బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని .
అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా న్యాయవాదుల కోసం విశ్రాంతి గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో పాటు పలువురు న్యాయవాదులు సమావేశంలో పాల్గొన్నారు.










