అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె గ్రామంలో సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎంపీటీసీ, మాజీ జడ్పీటీసీ అంబా బత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో ప్రజలు టీడీపీ వైపు వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










