జూన్ 7 గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా – సండేస్ ఆన్ సైకిల్ ప్రోగ్రాం

0
0

తెలంగాణ జూన్ 3 : క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌స్) ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ పోస్టర్ ను ఆవిష్కరించిన చైర్మన్ శివసేన రెడ్డి, వీసీ & ఎండీ సోని బాల దేవి,ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఫిట్‌నెస్ కి డోస్–ఆధా గంటా రోజ్  నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువత, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సాధారణ ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్, చురుకైన జీవన విధానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.