చింతూరులో తృటిలో తప్పిన పెను ప్రమాదం: మంటల్లో దగ్ధమైన గూడ్స్ లారీ!

0
0

చింతూరు మార్గంలో బుధవారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుండి చింతూరు వైపు వెళ్తున్న ఒక గూడ్స్ లారీ (నెంబర్: CG 18S 8034) ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది.మారేడుమిల్లి నుండి చింతూరు వైపు ఘాటీ దిగి తులసిపాక రాగానే, లారీ వెనుక వైపు ఉన్న టైర్ల నుండి ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. లారీ డ్రైవర్ గమనించే లోపే ఆ నిప్పురవ్వలు కాస్తా పెద్ద మంటలుగా మారి, క్షణాల వ్యవధిలోనే వాహనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. లారీ పూర్తిగా అగ్నిఆహుతి అయిపోయింది.అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

 

# Yadagiri