మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డుపై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా జి.మేడపాడు, గంటి పెదపూడి, జగ్గంపేట ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడి చింతూరు వైపు విహారయాత్ర కోసం ఒక బోలెరో వాహనంలో బయలుదేరారు. అయితే, శుక్రవారం రోజున మారేడుమిల్లి-చింతూరు మధ్య ఉన్న ప్రమాదకరమైన ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా.
ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయిన బోలెరో వాహనం ఘోరంగా బోర్లా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు స్పందించి క్షతగాత్రులను అత్యవసరంగా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
# Yadagiri










