తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం.

0
0

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే ఎన్ఆర్ఐ (NRI) భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. సుపథం మార్గం ద్వారా పొందే ప్రత్యేక ప్రవేశ దర్శన గడువును 30 రోజుల నుండి 90 రోజులకు (3 నెలలు) పెంచింది. దీనివల్ల విదేశాల నుండి భారత్‌కు వచ్చిన భక్తులు తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్ సమర్పించి మూడు నెలల లోపు ఎప్పుడైనా స్వామివారిని దర్శించుకోవచ్చు.

మరోవైపు ‘శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకం’ కింద రూ. లక్ష విరాళం ఇచ్చే దాతలకు, వారి కుటుంబంలోని ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దాతల కోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్ కూడా అందుబాటులోకి వచ్చింది.