తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
“నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు” అంటూ సవాల్ విసిరారు.
KCRలా తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ కలలో కూడా ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు.
రేవంత్ మాటలు కోటలు దాటుతున్నా, చేతలు మాత్రం సచివాలయం గోడలు దాటట్లేదని ఎద్దేవా చేశారు.










