మల్లంపేట లో బారీ వర్షం

0
0

ప్రస్తుతం మల్లంపేట (హైదరాబాద్) పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు మరియు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ,మల్లంపేటతో పాటు బాచుపల్లి, దుండిగల్, నిజాంపేట్, కూకట్‌పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది.

‎హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం తన ప్రభావం చూపింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, కొంపల్లి, సుచిత్ర, అల్వాల్, శేరిలింగంపల్లి, చందానగర్, దుండిగల్, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో వర్షం జోరుగా కురిసింది. అలాగే షాపూర్ నగర్, జీడిమెట్ల, మల్లంపేట, KPHB కాలనీ, బాలాజీ నగర్, మూసాపేట్, ప్రశాంతి నగర్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో కూడా వాన పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.