హైడ్రా వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డిపై నెటిజన్ల ఫైర్
బెంగళూరు ‘ది హిందూ’ కాంక్లేవ్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలను ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ విధ్వంసంతో పోల్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “నేను తీవ్రంగా కూల్చివేశాను, కావాలంటే గూగుల్‌లో చూడండి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రాను తెచ్చానని చెప్పడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డిని ‘తెలంగాణ హిట్లర్’ అని అభివర్ణిస్తూ ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్‌లలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి అజ్ఞానపు, క్రూరత్వపు పోలికలు మాట్లాడటం తెలంగాణ సమాజానికి సిగ్గుచేటని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.









