🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది నీతి, నిజాయితీలతో పాటు పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
డీజీపీ కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో కీలక సమీక్ష జరిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ నితికా పంత్, IPS మరియు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.









