మదనపల్లె పట్టణ వడ్డెర సంఘం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బైపాస్ రోడ్డులోని పిపిఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ అధ్యక్షుడిగా ఇడగొట్టి రెడ్డి శేఖర్ (డ్యాన్స్ రెడ్డెప్ప), ప్రధాన కార్యదర్శిగా పల్లపు రమేష్, కోశాధికారిగా డేరంగుల గుణభూషణ ఎన్నికయ్యారు.
ఎమ్మెల్యే వడ్డెరల సేవలను కొనియాడుతూ, వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వడ్డెర భవన నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు.










