హైకోర్టు ఆదేశాలు ఉన్నా వేధింపులు: బాధితుల ఆవేదన.

0
0

మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీకి చెందిన పలువురు బాధితులు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు పదేపదే సర్వేలు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని శుక్రవారం ఆరోపించారు. సర్వే నంబర్ 102లోని సబ్‌డివిజన్లలో ఇంటి స్థలాలు కొనుగోలు చేసిన తమను అనవసరంగా వేధిస్తున్నారని తెలిపారు.

గతంలో ప్రహరీ గోడ తొలగించేందుకు జేసీబీతో వచ్చిన అధికారులు స్థానికుల నిరసనతో వెనుదిరిగారని గుర్తుచేశారు. ఇకపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితుడు వాసుదేవ హెచ్చరించారు.