ఎమ్మిగనూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో

0
0

కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఎన్నికల హామీలను తుంగలో తొక్కారంటూ ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్’ హామీలతో ప్రజలను వంచించి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యావ్యవస్థ వైఫల్యం, శాంతిభద్రతల క్షీణతపై మండిపడ్డారు. జగన్ హయాంలో కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందాయని గుర్తుచేస్తూ.. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.