ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం, స్వర్ణాంధ్రే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

0
0

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం, స్వర్ణాంధ్రే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. గత ప్రభుత్వం మిగిల్చిన సవాళ్లు, సంక్షోభాలను అధిగమించి అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. అధికారం బాధ్యతని, తాము ప్రజలకు సేవకులమని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రగతికి అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో ‘స్వర్ణాంధ్ర’ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కూటమి విజయవంతమైన పాలనను అభినందిస్తూ పోస్ట్ చేశారు.