🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి 2025-26 కేఎంఎస్ కింద ఏర్పాటు చేసిన 40 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ శుక్రవారంతో విజయవంతంగా ముగిసిందని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,034 మంది రైతుల నుంచి 14,962 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడం జరిగిందని.
ఇప్పటికే 492 మంది రైతులకు సంబంధించిన రూ.6 కోట్ల నగదును వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేశామని ఆయన వివరించారు. మిగిలిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలను కూడా రాబోయే మూడు రోజుల్లోగా పూర్తిగా చెల్లించి క్లియర్ చేస్తామని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.










