ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ 15న ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది.
18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులైన ఎవరైనా రక్తదానం చేయవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చని మెడికల్ ఆఫీసర్ భార్గవ్ తెలిపారు. రక్తనిధి ఇన్చార్జ్ దిలీప్ మాట్లాడుతూ, స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. అత్యవసర సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్న వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు# కొత్తూరు మురళి.










