గాలివీడు మండలం గాలివీడు టౌన్ లోని బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో సేవ భావం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తల సేమియా బాధిత చిన్నారుల కోసం నిర్వహించిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా రక్తనాళం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణాలను నిలబెట్టే మహా దానమని ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి రక్తపు బొట్టు ఎంతో విలువైనదని తెలిపారు సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు గత రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఐదు సార్లు రక్తదానం చేసిన రాంప్రసాద్ రెడ్డి గారు సేవ భావానికి నిదర్శనంగా నిలుస్తున్నారు ప్రజల కోసం పనిచేయడమే కాకుండా అవసరమైన సమయంలో ప్రాణదాతగా మారడం ఆయన గొప్ప మనసుకు అద్దం పడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అభినందించాడు










