హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్

0
0

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వ్యాధి వచ్చాక కాకుండా, రాకముందే గుర్తించే ‘ప్రెడిక్టివ్ హెల్త్‌కేర్’ విధానాన్ని సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేస్తూ, వ్యాధులను ముందే గుర్తిస్తున్నామన్నారు. రోగుల వైద్య చరిత్రను డిజిటలైజ్ చేశామని, టెలిమెడిసిన్ సేవలు కూడా అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యంలో ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వెల్లడించారు.