యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ప్రశాంతి రెడ్డి

0
1

యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

నెల్లూరు జిల్లాలో యూరియా కొరత ఉందంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతుల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలు రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచిందని, రైతులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు.