ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.

0
1

ఏపీలోని ట్రిపుల్ ఐటీ (RGUKT) క్యాంపస్‌లలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు ప్రవేశాల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మొత్తం 44,104 దరఖాస్తులు రాగా, నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం 4,040 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.

ఎంపికైన వారిలో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు. విద్యార్థులు rgukt.in వెబ్‌సైట్ ద్వారా సెలెక్షన్ లేఖలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, సందేహాల కోసం 9552300009 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.