అరుదైన విదేశీ పక్షికి శస్త్రచికిత్స|

0
1

స్థానిక బహుళార్థ పశువైద్యశాలలో ‘పెలికాన్’ అనే అరుదైన విదేశీ కొంగజాతి పక్షికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ పక్షి ఛాతీ కింద తీవ్రమైన గాయం కాగా, ఫారెస్ట్ సిబ్బంది సహాయంతో పశువైద్యశాలకు తరలించారు. వెటర్నరీ డాక్టర్ మోహనరావు ఆధ్వర్యంలో వైద్య బృందం పక్షికి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పక్షి కోలుకుంటోందని వెటర్నరీ వైద్యులు తెలిపారు.

#BOIENA RAJESH