ఈరోజు నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగ సోదర సోదరీమణులకు అవసరమైన సహాయ పరికరాలను అందజేయడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా రూ.4 కోట్ల విలువైన పరికరాలు, 3000 మందికి పైగా దివ్యాంగులు, వయోవృద్ధులకు అందించడం జరిగింది. వారి జీవితాల్లో మరింత ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించిన ALIMCO సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, వారి జీవితాలను మరింత సులభతరం చేసే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు, దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నారాయణస్వామి గారు, నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు, మరియు ALIMCO సంస్థ సభ్యులు పాల్గొన్నారు.










