ఈరోజు ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వ “నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” విజయోత్సవ సభలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, సహచర మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారు, కూటమి పార్టీల జిల్లా టీడీపీ అధ్యక్షులు, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాము. అలాగే రెండేళ్ల కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన పలు శాఖల ప్రదర్శన స్టాల్స్‌ను పరిశీలించాము. ప్రకాశం జిల్లా అభివృద్ధికి అత్యంత కీలకమైన గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ, నిర్వాసిత కుటుంబాల సంక్షేమానికి అవసరమైన నిధులను కేటాయించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాము. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడం, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది.










