ప్రమాదానికి గురైన లైన్‌మెన్‌కు అండగా నిలిచిన కొరికాన దంపతులు..|

0
0

ప్రమాదానికి గురైన లైన్‌మెన్‌కు అండగా నిలిచిన కొరికాన దంపతులు..

మెలియాపుట్టి మండలం రట్టిని గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ లైన్‌మెన్ ఇప్పలి మోహన్ విద్యుత్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాధితుని పరిస్థితిని తెలుసుకున్న సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, పాతపట్నం నియోజకవర్గం జనసేన నాయకురాలు కొరికాన భవాని మానవతా దృక్పథంతో స్పందించారు.

మెరుగైన వైద్యం కోసం రూ. 25 వేల ఆర్థిక సాయాన్ని జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారి చేతుల మీదుగా బాధితుడి కుటుంబానికి అందజేశారు.