చిన్నారుల అక్షరాభ్యాసం, ఏకరూప దుస్తుల పంపిణీ

0
0

చిలుకూరు  మండల కేంద్రంలోని అంగన్వాడి 4 నందు చిన్నారులకు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, వార్డ్ సభ్యులు బెల్లంకొండ సైదులు ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. అనంతరము బాలలకు యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరముల లోపు బాల బాలికలను అంగన్వాడీల నందు చేర్పించాలని ప్రభుత్వము వారి శారీరక అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తుందని, అంగన్వాడీ కేంద్రాలలో బాలల మానసిక అభివృద్ధికి ఎన్నో ఉపయోగకరమైన ఉపకరణములు ఉన్నాయని చిన్నారులు మానసిక ఒత్తిడి లేకుండా ఆటపాటలతో విద్యని అభ్యసించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్ సునీత,టీచర్ సిరికొండ కవిత, ఆయా పుల్లమ్మ, తల్లులు మహిళలు పాల్గొన్నారు.