పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ సభలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి|

0
0

*అన్నమయ్య జిల్లా – రాయచోటి నియోజకవర్గం*

*📅 20-06-2026*

 

*🌾 రాయచోటి సాయి శుభకళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమం.. పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్, టీడీపీ అబ్జర్వర్ అన్నా అనిత యాదవ్..! 🚜💰*

 

రాయచోటి పట్టణంలోని సాయి శుభ కళ్యాణ మండపంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గారు, రాయచోటి తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ అన్నా అనిత యాదవ్ గారు* పాల్గొన్నారు.

 

🌾 ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు సంక్షేమం మరియు వ్యవసాయాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ చేయడం ద్వారా సాగు పెట్టుబడి భారాన్ని తగ్గించి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.

 

🚜 విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు వంటి వ్యవసాయ అవసరాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని, చిన్న, సన్నకారు రైతులతో పాటు అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం చేకూరుతోందన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

 

🤝 రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని *మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, కలెక్టర్ నిశాంత్ కుమార్ గారు, టీడీపీ అబ్జర్వర్ అన్నా అనిత యాదవ్ గారు* తెలిపారు. 🌱✅