భూసమస్యల పరిష్కారమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ రాజబాబు|

0
0

“మీ భూసమస్యకు శాశ్వత పరిష్కారం చూపటమే మా లక్ష్యం” – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు

లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రేజింగ్ ల్యాండ్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనమిత్ర, కౌశలం, అవేర్ 2.0 సేవలపై అవగాహన కల్పించారు. గర్భిణులు, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

భూ సమస్యలు, పెన్షన్లు, విద్యుత్, వ్యవసాయం, రోడ్లు, మ్యుటేషన్ తదితర అంశాలపై ప్రజలు వినిపించిన సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.