నమస్కారం మిత్రులారా 🙏
“యోగాతో ఆరోగ్యం – ఆంధ్రతో అభివృద్ధి” 🧘♂️
ఈరోజు మా తంగిరాలపల్లి పంచాయతీ తమ్మడపల్లి గ్రామంలో “యోగాంధ్ర 2026” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి అందించిన యోగాను, మన ప్రియతమ ముఖ్యమంత్రి నా దైవ సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు “యోగాంధ్ర” పేరుతో ప్రతి గడపకు తీసుకెళ్తున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టాం.
“ఆరోగ్యం లేకపోతే ఏమున్నా వృధా. రోజూ ఉదయం 30 నిమిషాలు యోగాకు కేటాయిద్దాం. BP, షుగర్, టెన్షన్ అన్నీ మన దరి చేరవు. మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే యోగ అలవాటు చేద్దాం. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనమంతా భాగస్వాములవుదాం” అని పిలుపునిచ్చాను.
ఈ కార్యక్రమంలో నాతో పాటు మాజీ సర్పంచ్ లింగాల అబ్రహం గారు సచివాలయం సిబ్బంది , మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులు కుర్రా శీను గారు తోకల రాజయ్య గారు, పిన్నిక గాలిరాజు గారు, పిన్నిక కొండలు, పిన్నిక హరికృష్ణ, నక్కా వెంకట నారాయణ, పిన్నిక శివంజినేయులు, కుర్రా సాయి, నక్కా పిచ్చయ్య, పోటు శివ, కుర్రా హరి, తోకల విష్ణువర్ధన్, కన్నెబోయిన, మరియు గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. యోగాను మన జీవన విధానంగా మార్చుకుందాం.
ఆరోగ్యమే మహాభాగ్యం 💪










