మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి అమలు చేయాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆల్వాల్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న బీహెచ్‌ఈఎల్ రోడ్డు అభివృద్ధి పనులు, హరిజన్ బస్తీ శ్మశానవాటిక అభివృద్ధి పనులతో పాటు స్థానిక ప్రజలకు అవసరమైన పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల గురించి ఆమె జోనల్ కమిషనర్‌తో చర్చించారు.
ప్రస్తుతం అనుమతుల కోసం ఎదురుచూస్తున్న ఈ పనులను త్వరితగతిన మంజూరు చేసి పూర్తి చేయాలని ఆమె కోరారు.
స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనుల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని శాంతి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
దీనిపై జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
#Sidhumaroju
Alwal










