శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ 9వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.ఎమ్మెల్యే కు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు , ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పురాతన దేవాలయాల అభివృద్ధి పనులకు సంపూర్ణ సహకారం అందిస్తూ,ప్రతి ఒక్కరిలో దైవభక్తి పెంపొందిస్తున్నామని అన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
నూతన కమిటీకి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే
శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ నూతన చైర్మన్ గా నియమింపబడ్డ రంగు శ్రీనివాస్ ను అభినందించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, దేవాలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు విన్నవించారు నూతన కమిటీ బాధ్యులు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చల్లా చక్రపాణి , కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు
.










