మదనపల్లె ఎన్వీఆర్ లేఅవుట్‌కు చెందిన చెవిటి, మూగ మహిళ షర్మిలను రేషన్ కార్డులో మృతురాలిగా నమోదు చేయడంతో ఆమెకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. వివాహిత అయిన షర్మిలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను బ్రతికే ఉన్నానని, తన పేరు సరిచేసి న్యాయం చేయాలని ఆమె సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించింది. ఈ విషయంపై ఐటీయూసీ నాయకుడు గొంగడి కృష్ణమూర్తి స్పందించి, అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










