బోనాల పండుగ వేళ 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేత!|

0
1

బోనాల పండుగను పురస్కరించుకుని శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజుల పాటు వైన్స్‌ షాపులు మూసివేయనున్నట్లు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

పండుగ సందర్భంగా శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని మద్యం విక్రయాలను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో మూడు రోజుల పాటు మద్యం దొరకదని తెలియడంతో మందుబాబులు ముందుగానే అప్రమత్తమయ్యారు.

“మూడు రోజులు షాపులు బంద్‌ అంటున్నారు… ముందే ఏర్పాట్లు చేసుకున్నాం!” అంటూ కొందరు మందుబాబులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.