భారత్ ఆవాజ్ న్యూస్ :24 జూన్న రోజున ర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుగ్గొండి మండలం చాపలబండ గ్రామానికి చెందిన తోకల శ్రీనివాస్ రెడ్డి . నియమిస్తున్నట్టు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి తెలిపారు. అనంతరం తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నాకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా అవకాశం కల్పించడం సంతోషకరమని అన్నారు వారు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్పార్టీ నాయకులను ఏకతాటిపై నడిపించి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు, నా ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










