ఆసిఫాబాద్ 1వ వార్డు సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ|

0
65

కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్, జూన్ 25:రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఉన్న పలు ప్రజా సమస్యలను స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గురువారం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ ఎస్ఐ రామయ్యలను వార్డుకు స్వయంగా పిలిపించి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను దగ్గరుండి చూపించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ.. వార్డులోని సమస్యలను త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ రామయ్య, మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.