రాయచోటి నియోజకవర్గంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు, ముఖ్యంగా బలిజలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గండికోట సుధాకర్ ప్రశంసించారు. కుల, మతాలకు అతీతంగా కార్యకర్తలకు గుర్తింపు నిస్తూ, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి టీడీపీ మండల అధ్యక్షులుగా కాపులను ఎంపిక చేయడం ఆయన నాయకత్వానికి నిదర్శనమన్నారు.
ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు. ప్రజాబలంతో గెలిచిన పవన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని, ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే ప్రజాస్వామ్యబద్ధంగా గట్టిగా ఖండిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని కొనియాడారు.









