సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ|

0
0

ఈ నెల 27వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటావానిపల్లికి రానున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల పురోగతి పరిశీలనతో పాటు, నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత, ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజులు కలిసి హెలిప్యాడ్, సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పర్యటన నిమిత్తం 400 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో జేసీ శ్రీనివాసులు, గూడూరి ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు.