పవన్ కల్యాణ్ ను కలిసిన రామ్ చరణ్..|

0
1

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కల్యాణ్ ఏపీలో అఖండ విజయం సాధించి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీరిద్దరూ అధికారికంగా భేటీ అవ్వడం ఇదే తొలిసారి.

అమరావతిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ‘ఆంధ్ర ప్రీమియర్ లీగ్’ (ఏపీఎల్) వేడుకకు హాజరయ్యేందుకు రామ్ చరణ్ మంగళగిరికి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని తన బాబాయ్‌కి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇద్దరూ కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చే ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.