🎤అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, పాఠశాల దశ నుంచే మంచి విలువలు అలవర్చుకోవాలని సూచించారు.
అనంతరం “వాల్ ఆఫ్ ప్రామిస్”పై అధికారులు, విద్యార్థులు డ్రగ్స్ నిరోధక సందేశాలు రాసి సంతకాలు చేసి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు.










