సీఎం పర్యటనకు మార్కాపురం జిల్లాలో పటిష్ట పోలీస్ బందోబస్తు|

0
0

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించి భద్రతా చర్యలపై కీలక సూచనలు చేశారు.

హెలిప్యాడ్, సభా వేదిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్‌ను కూడా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.