ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్ల ఆవిష్కరణ.|

0
0

మదనపల్లెలో గురువారం సాయంత్రం 18వ ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ గ్రామోత్సవంలో వాలీబాల్, త్రోబాల్ వంటి గ్రామీణ క్రీడా పోటీలు జరుగుతాయి. గ్రామీణ యువత తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.