ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా చేపట్టాలి: చైర్మన్ ఆకాష్|

0
0

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్: పట్టణంలో ఓటరు జాబితా (SIR) ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, హడుకో కాలనీలలో మున్సిపల్ బృందం, బూత్ స్థాయి సిబ్బందితో కలిసి వారు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, పొరపాట్లకు తావులేకుండా అర్హుల పేర్లను చేర్చాలని, ఎవరి పేర్లూ అనవసరంగా తొలగించబడకుండా చూసే బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైన ఆయుధమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రాజకీయ శ్రేణులు, సామాజిక కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో స్థానిక కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బిన్ అహ్మద్, బాలకృష్ణలతో పాటు వార్డు అధికారి మానుష, బీఆర్ఎస్ నాయకులు అశోక్, సాయి, బూత్ స్థాయి సిబ్బంది లక్ష్మి, భాగ్యలక్ష్మి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.