బాలయ్యకు 111 చిత్రాల ప్రత్యేక చిత్రమాలిక బహుకరణ
కోట్లాదిమంది అభిమాన హీరో బాలయ్య
ఆంధ్రప్రదేశ్ అభిమాన సంఘ నాయకుడు వడ్డెల్లి
నందిగామ జూన్ 25 మెట్రో ఉదయం :
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్ర ముహూర్త కార్యక్రమం సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక చిత్రమాలికను అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల జాతీయ ఉపాధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు బాలకృష్ణకు అందజేశారు.
అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటాయపాలెం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, బాలకృష్ణ ఇప్పటివరకు నటించిన 111 సినిమాల పేర్లతో రూపొందించిన వినూత్న చిత్రమాలికను అభిమానుల తరఫున బహుకరించారు.
ఈ సందర్భంగా వడ్డెల్లి సాంబశివరావు మాట్లాడుతూ, నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలు అందిస్తూ కోట్లాది మంది అభిమానుల ప్రేమాభిమానాలను సంపాదించుకున్నారని పేర్కొన్నారు. 112వ సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక చిత్రమాలికను అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకులు, సినీ అభిమానులు పాల్గొన్నారు.










