ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వేదులపల్లి పోలీసులు ప్రతి ఆటోకు ప్రత్యేక సీరియల్ నంబర్ కేటాయించి ముందు, వెనుక భాగాల్లో ప్రదర్శించేలా చర్యలు చేపట్టారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించి, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు అందుబాటులో ఉంచాలని ఎస్సై ఎం.
వెంకటేశ్వర్లు సూచించారు. ఆటో డ్రైవర్ వివరాలను సీటు వెనుక భాగంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు భరోసా కలుగుతుందని తెలిపారు. అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తూ ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సేవలు అందించాలని ఆటో డ్రైవర్లను కోరారు.










