భోగాపురం మండలం రావాడ గ్రామానికి చెందిన ఆర్మీ జవాను కనకల నారాయణ రావు (36) రాజస్థాన్ కోటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సహచరుడు దీపక్‌తో కలిసి సైనిక సామగ్రి తీసుకెళ్తుండగా ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవేపై వీరి వాహనాన్ని మరో వాహనం ఢీకొంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
#RAJESH










