ప్రతి ఓటూ నమోదు కావాలి SIRలో వేగం పెంచండి.|

0
0

“BLAలతో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీగణేష్.. ఒక్క ఓటూ మిస్ కాకూడదని సూచన”

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) కీలక పాత్ర పోషించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు. శనివారం వార్డు-1 పరిధిలోని పెన్షన్ లైన్ ప్రభుత్వ పాఠశాల వద్ద నిర్వహించిన BLAల ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా ఉండేలా చూడాలని, ఒక్క పేరు కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువతను వెంటనే ఓటరుగా నమోదు చేయించాలని, ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. 

పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని BLAలకు దిశానిర్దేశం చేశారు.

ప్రజల సౌకర్యార్థం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొత్త ఓటరు నమోదు, పేరు సవరణ, చిరునామా మార్పు తదితర సేవలను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని ప్రతి గడపకు చేర్చి ప్రజలు హెల్ప్‌డెస్క్‌లను సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.

ప్రజాస్వామ్యం మరింత బలపడాలంటే ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండాలని, ఒక్క ఓటు కూడా వదిలిపోకుండా అందరూ బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బల్వంత్ రెడ్డి, ముప్పిడి మధుకర్, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ సంకి రవీందర్, మారుతి గౌడ్, హరికృష్ణ, సదానంద్, రియాజుద్దీన్ (గుడ్డు), రాజు, వార్డు-1 పరిధిలోని BLAలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#Sidhumaroju