రహదారి భద్రతే లక్ష్యం… నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన అధిక వెలుతురు (హై ఇంటెన్సిటీ) ఎల్‌ఈడీ లైట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలకు అమర్చిన అనధికారిక ఎల్‌ఈడీ లైట్లను తొలగించి, సంబంధిత వాహనదారులకు మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి అధిక వెలుతురు లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగించి రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని పోలీసులు వివరించారు.
ప్రజలు తమ వాహనాల్లో అనుమతించబడిన ప్రమాణాల ప్రకారం మాత్రమే లైట్లను వినియోగించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితమైన రహదారి వాతావరణాన్ని కల్పించడంలో పోలీసులకు సహకరించాలని ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు









