కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని వాసవి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా డోంగ్రె సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జాబరి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా రాయిసిడాం eవినోద్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కృష్ణాజీ బాధ్యతలు చేపట్టారు.
ఉపాధ్యక్షులుగా వందన, రాజక్క, బుచ్చక్క, సురేష్, సహాయ కార్యదర్శులుగా విజయలక్ష్మి, రేణుకలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి నూతన కార్యవర్గం సమిష్టిగా కృషి చేస్తుందని ప్రతినిధులు తెలిపారు.










