కాలనీలో మాజీ కార్పొరేటర్ పర్యటన.|

0
11

“వెంకటరమణ కాలనీలో సమస్యలను పరిశీలించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.”

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంకటరమణ కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మేనేజర్ రమేష్, యాదగిరి, జార్జ్‌తో కలిసి కాలనీలోని మురుగునీటి పారుదల సమస్యలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు అవసరం, సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అంశాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు.

కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని శాంతి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal