బిర్సా ముండా 151వ జయంతిని ఘనంగా నిర్వహించాలి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత

0
2

ఆసిఫాబాద్, నవంబర్ 14 (భారత్ ఆవాజ్ న్యూస్): ఆదివాసీ ఆరాధ్య దైవం, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 151వ జయంతి మరియు ‘జన జాతీయ గౌరవ దివస్’ వేడుకలను జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత పిలుపునిచ్చారు.

ఈ నెల 15వ తేదీన (ఆదివారం) ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివాసీల హక్కులు, వారి విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఘనమైన చరిత్రను భావితరాలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, యువత మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత కోరారు.